హత్యాయత్నం చేసిన వారికి బెయిలా? | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం చేసిన వారికి బెయిలా?

Mar 22 2026 1:33 AM | Updated on Mar 22 2026 1:33 AM

మాట్లాడుతున్న ఎంపీ రఘునందన్‌రావు

పాపన్నపేట(మెదక్‌): పోలీసులపై కాల్పులు జరిపిన డ్రగ్స్‌ ముఠాపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించాలని ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. శనివారం మండల పరిధిలోని లక్ష్మీనగర్‌లో పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ్‌ అభియాన్‌ కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులపై తుపాకులతో కాల్పులు జరిపిన డ్రగ్స్‌ ముఠాకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చింది తెలంగాణ పోలీసులే అన్నారు. డీజీపీ ఫాంహౌస్‌ సీసీ ఫుటేజీ చూసి నిష్పక్షపాత విచారణ జరపాలన్నారు. దోషులు ఎంతటి వారైన కఠిన శిక్ష పడేలా కేసులు నమోదు చేయాలని కోరారు. పైలెట్‌ రోహిత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈవిషయమై మాట్లాడవద్దని తనకు బీజేపీ పెద్దలెవరూ చెప్పలేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచమంతా అతలాకుతలమవుతుంటే, భారత ప్రజలు మాత్రం ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. ప్రజలందరూ సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్‌ మల్లేష్‌గౌడ్‌, జగిత్యాల జిల్లా ఇన్‌చార్జి గడ్డం శ్రీనివాస్‌, ప్రశిక్షణ జిల్లా కన్వీనర్‌ రంజిత్‌రెడ్డి, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, జనగామ జిల్లా ప్రచారి నందారెడ్డి, నాయకులు సు భాష్‌గౌడ్‌, సుధాకర్‌, ఎంఎల్‌ఎన్‌ రెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు సంతోష్‌చారి తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement