పోరాటాల ఫలితమే.. | - | Sakshi
Sakshi News home page

పోరాటాల ఫలితమే..

Mar 22 2026 1:33 AM | Updated on Mar 22 2026 1:33 AM

సిద్దిపేటజోన్‌: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ గట్టిగా వత్తిడి చేయడం వల్లే సర్కారు దిగివచ్చిందని, మా పోరాటాల ఫలితమే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్‌ యార్డులో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర ఉండగా, సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది రైతులు దళారులకు రూ.1600 నుంచి రూ.1700 అమ్మి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే 25శాతం మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఇప్పటికై నా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సన్‌ఫ్లవర్‌ క్వింటాల్‌ రూ.7,721 మద్దతు ధర ఉందని, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ఒకప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో 8వేల ఎకరాల్లో యాసంగికి సాగు ఉండేదని, కాళేశ్వరం పుణ్యమా అని పదింతలు పెరిగి 80 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. కాళేశ్వరం వచ్చాక కరువు అనే పదం లేదన్నారు. జిల్లా వ్యవసాయ రూపురేఖలు మార్చిన ఘనత కాళేశ్వరానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వేణుగోపాల్‌ రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్స్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఒత్తిడి వల్లే కొనుగోలుకేంద్రాల ఏర్పాటు

సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పటికేదిగుబడులు దళారుల చేతుల్లోకి

మాజీ మంత్రి హరీశ్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement