హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలుపుతాం
హుస్నాబాద్: ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రిటైర్డ్ జడ్జిచే నివేదిక తయారు చేసి హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సికింద్రాబాద్ గతంలో జిల్లా కాదని, జిల్లాల విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్ కాకుండా మల్కాజిగిరి జిల్లా చేశారని మంత్రి గుర్తు చేశారు. హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్దిపేటలో కలిపితే నిరసనలు, ఆమరణ దీక్షలు చేశారన్నారు. అప్పుడు ఇక్కడి నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా ప్రాంతాలు ఉండాలన్నారు. పార్టీ నిర్ణయం మేరకే మున్సిపల్ చైర్మన్ అవుతారని అన్నారు. స్ధానిక నాయకుల పై సర్వే జరుగుతుందని, గెలుపు ఆధారంగా టికెట్లు ఇస్తామని తెలిపారు.


