గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి
కొల్చారం(నర్సాపూర్): గ్రామీణ క్రీడలను ప్రభుత్వ ం ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం మండలంలోని కోనాపూర్‌లో కేపీఎల్ సీజన్–2 క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. విన్నర్, రన్నర్‌గా నిలిచిన జట్లకు సర్పంచ్ నిర్మల, బీఆర్‌ఎస్ మండల యువత అధ్యక్షుడు సంతోశ్‌రావుతో కలిసి ఎమ్మెల్యే ట్రోఫీలతో పాటు నగదు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్నేహపూర్వక వాతావరణంలో పోటీలు జరగడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పై తర సర్పంచ్ రవితేజరెడ్డి, ఉపసర్పంచ్ మురళీరావు, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్‌గుప్తా, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి


