ఎరుపెక్కిన మెతుకుసీమ
మెదక్‌జోన్/మెదక్ కలెక్టరేట్: సీఐటీయూ రాష్ట్ర మహాసభలు ఆదివారం మెదక్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూల ల నుంచి భారీ ఎత్తున కార్మికులు తరలివచ్చారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రా ములు, అఖిల భారత ఉపాధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని విధులు నిర్వరించే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిన విధులు నిర్వహించే లక్షలాది మందికి కార్మిక చట్టం ప్రకారం వేతనాలు అందటం లేదన్నారు. కార్మిక చట్టం (వెజ్‌బోర్డు) ప్రకారం ప్రతి కార్మికుడిని పీఎఫ్, ఈఎస్‌ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో యాజమాన్యాలు తప్పు చేస్తే వెజ్‌బోర్డు ఆధారంగా వారిని జైలుకు పంపే అధికారం కార్మిక చట్టాల్లో ఉండేదని, ప్రస్తుతం వాటిని తొలగించి కార్మికులు హక్కుల కోసం ప్రశ్నిస్తే శిక్షించే విధంగా నూతన కార్మిక చట్టాలను తెచ్చారని వాపోయారు. కార్మికులు రోజుకు 8 గంటల కన్నా ఎక్కువగా పనిచేయరాదనే నిబంధన ఉండేదని, ప్రస్తుతం నూతన చట్టాల్లో దాన్ని తొలగించారన్నారు. వీటిని సాధించుకోవటానికి అంతా ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ కోషాధికారి సాయిబాబ, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య, రమణ, జిల్లా నేతలు మల్లేశం, బాలమణి తదితరులు పాల్గొన్నారు.
అట్టహాసంగా ప్రారంభమైన
సీఐటీయూ రాష్ట్ర మహాసభలు


