వేడెక్కిన పంచాయతీ
G°²-MýS-ÌSOò³ ´ëÈ-tÌS {ç³™ólÅMýS ¯]lfÆŠḥæ
పంచాయతీ ఎన్నికలపై పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. మొదటి విడత ఎన్నికల పోలింగ్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కృషి చేస్తున్నారు.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో ఆరు మండలాల పరిధిలో 144 గ్రామాలకు ఈనెల 11న ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ వచ్చే ఫలితాలే రెండు, మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకెళ్తున్నాయి. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించాలని ఏకంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ముఖ్య నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో పల్లెపోరు సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. అలాగే గడువు దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా శాయశక్తులు ఒడ్డుతున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీ
మెతుకుసీమలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉండగా, మెదక్, తూప్రాన్, నర్సాపూర్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో నర్సాపూర్ డివిజన్‌లో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నియోజకవర్గంలో తమ పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ మెజార్టీ స్థానా లపై గురిపెట్టింది. ఈ క్రమంలోనే రెండు పార్టీలు అప్రమత్తమై ఎత్తుగడలతో ముందుకుసాగుతున్నాయి. ఇప్పటికే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించారు. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా రు. అలాగే పెద్దశంకరంపేట మండలం నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోనిది కాగా ఆ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఇటీవల జూకల్, రామోజీపల్లి, వీరోజిపల్లి, మల్కాపూర్, గొట్టిముక్కల తదితర గ్రామా ల్లో విస్తృతంగా పర్యటించారు. అధికార పార్టీ అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపిస్తే పల్లెలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావుతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు ఆదివారం పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్, శానాయిపల్లి, పొడ్చంపల్లి, నాగ్సాన్‌పల్లి, కొ డపాక, గాజులగూడెం ఎనకపల్లి తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్నికల్లో గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు శనివారం మెదక్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, ముఖ్య నేతల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పల్లెల అభివృద్ధి కోసం విడుదలయ్యే నిధు ల్లో పెద్ద మొత్తం కేంద్ర ప్రభుత్వానివేనని, గ్రా మాల్లో బీజేపీ అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపిస్తే పార్లమెంట్ సభ్యుడిగా పల్లెల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి మొదటి విడత ఎన్నికల ఫలితాలు మూడు రోజుల తర్వాత బయటపడే అవకాశముండగా, జిల్లాలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మొదటి విడత పోలింగ్ సమీపించడంతో అప్రమత్తం
అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం


