హామీల అమలులో విఫలం
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
హత్నూర(సంగారెడ్డి): హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. ఆదివారం హత్నూర మండలం సికిందల్లాపూర్, మంగాపూర్, నస్తీపూర్‌లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపి ంచి కాంగ్రెస్ సర్కారుకు బుద్ధ్ది చెప్పాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.


