
తీరని యూరియా కష్టాలు
చేగుంట(తూప్రాన్)/శివ్వంపేట(నర్సాపూర్): రోజులు గడుస్తున్నా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. శుక్రవారం రైతులు భారీ సంఖ్యలో చేగుంట రైతు వేదిక, ఇబ్రహీంపూర్ సహకార సంఘం వద్దకు చేరుకున్నారు. చేగుంటలో 4 వందల బస్తాలు, ఇబ్రహీంపూర్‌లో లారీ లోడు మధ్యాహ్నం వరకు పంపిణీ చేశారు. అందని రైతులు అధికారులను నిలదీయగా రెండు రోజుల్లో యూరియా తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అలాగే శివ్వంపేట పీఏసీఎస్ కేంద్రంలో 450 బస్తాల యూరియా అందుబాటులో ఉండగా, పంపిణీ చేశారు. అయితే చాలా మంది రైతులు క్యూలో ఉన్నప్పటికీ యూరియా దొరకగా పోవడంతో నిరుత్సాహంగా వెనుతిరిగారు.

తీరని యూరియా కష్టాలు