
● కొసరు పనులకు నిధుల ఆటంకం ● రెండేళ్లుగా నిలిచిన నిర్మా
తూప్రాన్: ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు గత ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండాలని చర్యలు చేపట్టింది. ఇందుకోసం మూడేళ్ల క్రితం రూ. 8 కోట్ల నిధులతో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సమీకృత భవన నిర్మా ణ పనులకు శ్రీకారం చుట్టింది. సుమారు 30 వేల చదరపు అడుగుల స్థలంలో విశాలమైన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని ఐకేపీ, తహసీల్దార్, మండల వనరుల కేంద్రం భవనాలను కూల్చి వేసి సమీకృత భవన నిర్మాణ పనులకు నిధు లు మంజూరు చేశారు. ఏడాది వ్యవధిలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మూడేళ్లు గడుస్తున్నప్పటికీ పూర్తి కాలేదు. గతంలో గడా ప్రత్యేకాధికారి గా ఉన్న ముత్యంరెడ్డి పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ అంతలోనే ఎన్నికల కోడ్ రావడం, ప్రభుత్వం మారడంతో పట్టించుకునే వారు కరువయ్యారు.
అద్దె భవనాల్లో అవస్థలు..
నిధుల విషయమై ఇటీవల అధికారులు కలెక్టర్ రాహుల్ రాజ్ దృష్టికి తీసుకెళ్లడంతో తన సొంత నిధుల నుంచి రూ. 7.5 లక్షలు విడుదల చేశారు. దీంతో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో నెల రోజుల్లో పనులు పూర్తి కానున్నాయని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఆ వెంటనే ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను సమీకృత సముదాయంలోకి రానున్నాయి. మిగితా కార్యాలయాలు విడతల వారీగా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా డివిజన్ కేంద్రం ఏర్పడినప్పటికీ అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో కార్యాల యాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఆయా పనులపై వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నిధుల కొరతతోనే..
నిధుల కొరతతో పనుల్లో జాప్యం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. అయన స్పందించి రూ.7.5 లక్షలు విడుదల చేశారు. ఈ నిధులతో కొంత మేర పనులు పూర్తి చేస్తాం. మొదటగా ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీ డీఓ కార్యాలయాలు అందుబాటులోకి తెస్తాం.
– ఎస్. మధుసూదన్, ఏఈ పంచాయతీరాజ్