
ఆయిల్‌పామ్‌తో అధిక లాభం
● ఉద్యానశాఖ సంచాలకులు యాస్మిన్ బాషా ● చిన్నగొట్టిముక్లలో మెగా ఆయిల్ ప్లాంటేషన్
శివ్వంపేట(నర్సాపూర్): ఆయిల్‌పామ్ సాగు రైతులకు అన్ని విధాలుగా లాభదాయకమని, ఈ పంట సాగు చేసేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకులు యాస్మిన్‌న్ బాషా అన్నారు. శనివారం మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల గ్రామ పరిధిలో మాజీ ఐఏఎస్ అధికారి సింగాయిపల్లి నర్సింగరావు వ్యవసాయ పొలంలో ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్‌రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులు ఆసక్తి కనబరిస్తే స్థిర ఆదాయం ఉంటుందన్నారు. ఆయిల్‌పామ్ పంటకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఈ పంటకు అటవీ జంతువులు, దొంగల బెడద ఉండదని, ఉద్యానవన శాఖ సబ్సిడీపై మొక్కలు అందిస్తుందన్నారు. ఈ సాగులో అంతర్ పంటలు వేసుకోవచ్చని, పంట చేతికి వచ్చిన తర్వాత మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంబంధిత కంపనీ కొనుగోలు చేస్తుందన్నారు. అనంతరం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ప్రతాప్‌సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 2025–26 ఏడాదికి 2,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసే విధంగా లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లివ్ పామ్ మేనేజింగ్ డైరెక్టర్ సాయి, ఆర్‌డీఓ మైపాల్‌రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, ఏఓ లావణ్య, ఆర్‌ఐ కిషన్, జిల్లా రైతు సమన్వయ సమితి గౌరవ అధ్యక్షుడు మైసయ్యయాదవ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.