కార్మిక నేత ఎల్లయ్య కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

కార్మిక నేత ఎల్లయ్య కన్నుమూత

Sep 6 2025 9:11 AM | Updated on Sep 6 2025 9:11 AM

కార్మ

కార్మిక నేత ఎల్లయ్య కన్నుమూత

రామాయంపేట(మెదక్‌): జాతీయ కార్మిక సంఘం నేత గాజుల ఎల్లయ్య గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మండలంలోని అక్కన్నపేటకు చెందిన ఎల్లయ్య పదో తరగతి వరకు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ చదువుతో పాటు రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి బీహెచ్‌ఈఎల్‌ కార్మిక సంఘం నేతగా గుర్తింపు పొందారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. సుమారు 40 ఏళ్లుగా కార్మిక సంఘం నేతగా పనిచేశారు. ప్రధానులు మొదలుకొని ముఖ్యమంత్రులు, మంత్రుల వరకు మంచి పేరు గడించిన ఆయన ఎందరో కార్మికులకు ఆరాధ్యుడిగా మారారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. ఎల్లయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

మంజీరా వరదలతో జాగ్రత్త

పాపన్నపేట(మెదక్‌): మంజీరా వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని అదనపు ఎస్పీ మహేందర్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఏడుపాయలలో మంజీరా ప్రవాహాన్ని పరిశీలించారు. భక్తులు ఘనపురం ఆనకట్ట వైపు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

జీఎస్టీ తగ్గింపుతో

పేదలకు మేలు

నర్సాపూర్‌: పలు వస్తువులపై ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ స్లాబ్‌ తగ్గించడంతో పేదలకు మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం నాయకులతో కలిసి పట్టణంలోని చౌరస్తాలో ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గడంతో ప న్ను భారం తగ్గి వస్తువుల ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

రజకులను ఎస్సీ

జాబితాలో చేర్చాలి

టేక్మాల్‌(మెదక్‌): రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్ధార్‌ గోపి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. 2016 డిసెంబర్‌ 26న అసెంబ్లీలో రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. ఇందిరమ్మ కలలను సాకారం చేసే దిశగా అడుగులు వేయా లని కోరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, పార్లమె ంట్‌లో ఎంపీలు ఈ అంశంపై మాట్లాడినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోయారు. కార్యక్రమంలో రజక రిజర్వేషన్‌ సమితి మండల అధ్యక్షుడు రమేశ్‌, జిల్లా అధ్యక్షుడు కుమార్‌, ఉపాధ్యక్షుడు సాయి, జిల్లా యూత్‌ అధ్యక్షుడు ఉపేందర్‌ పాల్గొన్నారు.

‘ కార్మికుల సమస్యలు

పరిష్కరించాలి’

మెదక్‌ కలెక్టరేట్‌: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ యూనియన్‌ రాష్ట కార్యదర్శి కాటం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మెదక్‌లోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో నిర్వహించిన జిల్లా మహాసభలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఉద్యోగ భద్రత, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు. నాలుగు లేబర్‌ కోడ్లతో భవన నిర్మాణ కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ రంగ కార్మికుల యూనియన్‌ జిల్లా కార్యదర్శి గౌరీ, నాయకులు నరేందర్‌, లాలు, శివయ్య, అఫ్జల్‌ దాసు తదితరులు పాల్గొన్నారు.

కార్మిక నేత ఎల్లయ్య కన్నుమూత 
1
1/2

కార్మిక నేత ఎల్లయ్య కన్నుమూత

కార్మిక నేత ఎల్లయ్య కన్నుమూత 
2
2/2

కార్మిక నేత ఎల్లయ్య కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement