పోలింగ్‌ బూత్‌ల పరిశీలన | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ బూత్‌ల పరిశీలన

Published Fri, Nov 17 2023 4:26 AM

పతకాలు అందుకున్న విద్యార్థులతో 
మాస్టర్‌ నగేశ్‌, కోచ్‌ దినకర్‌  - Sakshi

రామాయంపేట(మెదక్‌): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్‌ బూత్‌లను గురువారం మున్సిపల్‌ కమిషనర్‌ ఉమాదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పలు బూత్‌లలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. అవసరమైన చోట మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. అనంతరం మున్సిపల్‌ ఏఈతో పర్యవేక్షించారు. అన్ని బూత్‌లలో మూత్రశాలలు, తాగునీటి వసతి కల్పిస్తామని ఉమాదేవి తెలిపారు.

అంతర్జాతీయ కరాటేలో

మెదక్‌ విద్యార్థుల ప్రతిభ

మెదక్‌ మున్సిపాలిటీ: మూడో అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్‌ విద్యార్థులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు రెంజుకి షోటోకాన్‌ వ్యవస్థాపకుడు, కరాటే మాస్టర్‌ నగేశ్‌ తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారికి గుల్షన్‌క్లబ్‌లో మెడల్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేశవ షోటోకాన్‌ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో 3వ అంతర్జాతీయ స్థాయి ఆన్‌లైన్‌ కటాస్‌ ఛాంపియన్‌షిప్స్‌ నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీలకు ఇండియాతో పాటు బూటాన్‌, జపాన్‌, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్‌, నేపాల్‌, బాంగ్లాదేశ్‌తో పాటు సుమారు 30 దేశాలు నుంచి మొత్తం 3వేల మంది విద్యార్థులు పాల్గొన్నారని, పోటీలలో రెంజుకి షోటోకాన్‌ మెదక్‌ విద్యార్థులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు నగేశ్‌ తెలిపారు. కార్యక్రమంలో కరాటే కోచ్‌ దినకర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి చిత్రలేఖనంలో రాణించిన విద్యార్థిని

మనోహరాబాద్‌(తూప్రాన్‌): హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయిలో జరిగిన చిత్రలేఖన పోటీలలో మనోహరాబాద్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని అరీబా ఉత్తమ ప్రతిభ కనబర్చింది. గురువారం జరిగిన పోటీలలో తమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆమె ఖనమ్‌ కన్సోలేషన్‌ బహుమతితో పాటు, రూ.9500 పొందినట్టు హెచ్‌ఎం రహెనా సుల్తానా తెలిపారు. అరీబాను చిత్రలేఖన ఉపాధ్యాయుడు బ్రహ్మచారి పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

పెండింగ్‌ బిల్లులను

మంజూరు చేయాలి

టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సంగయ్య

పాపన్నపేట(మెదక్‌): ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లులు వెంటనే మంజూరీ చేయాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సంగయ్య డిమాండ్‌ చేశారు. మండలంలోని యూసుఫ్‌పేట్‌, పాపన్నపేట, నార్సింగ్‌, చీకోడ్‌, లింగాయిపల్లి, కొడపాక, నాగ్సాన్‌పల్లి గ్రామాల్లోని పాఠశాలలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగిపోయిన ప్రమోషన్లు, పెండింగ్‌ బిల్లులు, బదిలీలను చేపట్టాలన్నారు. ఉపాధ్యాయుల లోన్‌లు, సరెండర్‌ బిల్లులను మంజూరు చేయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్‌ హీరాలాల్‌, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్‌, మండల శాఖ అధ్యక్షుడు బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్‌ సమ్మేళనాన్ని

జయప్రదం చేయండి

మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ

వట్‌పల్లి (అందోల్‌): జోగిపేటలో శనివారం నిర్వహించే ముదిరాజ్‌ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ పిలుపునిచ్చారు. గురువారం అందోల్‌ మండల పరిధిలోని మసానిపల్లి గ్రామంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని 9 మండలాల ముదిరాజ్‌ బంధువులు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరు కావాలన్నారు.

పోలింగ్‌ బూత్‌ను పరిశీలిస్తున్న 
మున్సిపల్‌ కమిషనర్‌
1/3

పోలింగ్‌ బూత్‌ను పరిశీలిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌

మాట్లాడుతున్న సంగయ్య
2/3

మాట్లాడుతున్న సంగయ్య

బహుమతి అందుకుంటున్న విద్యార్థిని
3/3

బహుమతి అందుకుంటున్న విద్యార్థిని

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement