హైస్కూల్లో గ్రంథాలయం ప్రారంభం | Sakshi
Sakshi News home page

హైస్కూల్లో గ్రంథాలయం ప్రారంభం

Published Wed, Nov 15 2023 4:36 AM

చిన్న కిష్టాపూర్‌ పాఠశాలలో మాట్లాడుతున్న డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి  - Sakshi

కొండపాక(గజ్వేల్‌): కుకునూరుపల్లి మండల కేంద్రంలోని హైస్కూల్లో మంగళవారం డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి బాల చెలిమి గ్రంథాలయం, సైన్సు ల్యాబ్‌లను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆలోచనా విధానం, జ్ఞానం పెంపొందించుకునేందుకు దోహదపడుతాయన్నారు. పుస్తకాలు చదవడం, రాయడం ఎంతో లాభదాయకమని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎం సత్తయ్య, ఖైజర్‌, అశోక్‌, మనోజ్‌ పాల్గొన్నారు.

ఆకస్మిక తనిఖీ

జగదేవ్‌పూర్‌ (గజ్వేల్‌): బాలల దినోత్సవం పురస్కరించుకుని మండలంలోని చిన్నకిష్టాపూర్‌ ప్రాథమిక పాఠశాలను జిల్లా విధ్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. ఉపాధ్యాయురాలు సుధారాణి తన కూతురును ఇదే పాఠశాలలో చేర్పించినందుకు అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌, ఉపాధ్యాయులు అశోక్‌, శేఖర్‌ పాల్గొన్నారు

Advertisement
 
Advertisement