● గూగుల్‌ గుప్పిట్లో సమాచారం ● ప్రమాదకర ప్రాంతాలపై 500మీటర్ల ముందే అప్రమత్తం ● రహదారి భద్రతకు టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటు ● దారులపై అక్రమ హోటళ్ల తొలగింపు ● ప్రమాదాల నివారణకు రూ.కోటితో ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

● గూగుల్‌ గుప్పిట్లో సమాచారం ● ప్రమాదకర ప్రాంతాలపై 500మీటర్ల ముందే అప్రమత్తం ● రహదారి భద్రతకు టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటు ● దారులపై అక్రమ హోటళ్ల తొలగింపు ● ప్రమాదాల నివారణకు రూ.కోటితో ప్రత్యేక చర్యలు

Nov 26 2026 11:56 PM | Updated on Nov 26 2026 11:56 PM

● గూగుల్‌ గుప్పిట్లో సమాచారం ● ప్రమాదకర ప్రాంతాలపై 500మీటర్ల ముందే అప్రమత్తం ● రహదారి భద్రతకు టాస్క్‌ఫోర్స్‌ బృందం ఏర్పాటు ● దారులపై అక్రమ హోటళ్ల తొలగింపు ● ప్రమాదాల నివారణకు రూ.కోటితో ప్రత్యేక చర్యలు ● ఇందారం బ్రిడ్జి నుంచి గోదావరి బ్రిడ్జి వరకు స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు, కలెక్టరేట్‌ రహదారి–63పై స్పీడ్‌బ్రేకర్లు, సింగరేణి జీఎం కార్యాలయం వద్ద స్ట్రీట్‌లైట్లు తక్షణమే ఏర్పాటు చేయనున్నారు. ● కరీంనగర్‌, రామగుండం రహదారి, ఎన్‌హెచ్‌–363, ఎన్‌హెచ్‌–63, ఎస్‌హెచ్‌–24పై భారీ వాహనాలు క్యారేజ్‌వే/ఫేప్ట్‌ షోల్డర్లపై పార్కింగ్‌ చేయకుండా చర్యలు, ప్రతీ 75కిలోమీటర్ల దూరంలో వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ స్థలం, విశ్రాంతి గదులు, ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు, అక్రమంగా ఏర్పాటు చేసుకున్న దాబాలు, హోటళ్ల తొలగింపు. ● అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంటు సిస్టం ద్వారా రియల్‌ టైం అలర్ట్‌లు, జీపీఎస్‌ టైమ్‌స్టాంప్‌ ఫొటోగ్రాఫిక్‌ ఆధారాలతో పర్యవేక్షణ. ● సీసీ కెమెరాలు, ట్రాకింగ్‌ పరికరాలు, స్పీడ్‌గన్స్‌ కలిగిన పెట్రోలింగ్‌ వాహనాలు, బీఎల్‌ఎస్‌ అంబులెన్స్‌లు, రికవరీ క్రేన్లను అందుబాటులోకి తేనున్నారు. దూరం నుంచే కనిపించే రిఫ్లెక్టివ్‌ రహదారి సూచిక బోర్డుల ఏర్పా టు, అకస్మాత్తుగా వచ్చే మూలమలుపుల వద్ద ముందస్తుగా తెలిపే విధంగా సూచిక బోర్డులు, స్పీడ్‌బ్రేకర్లు, స్పీడ్‌గన్స్‌, బ్రీత్‌ ఎనలైజర్లతో నిరంతర తనిఖీలు చేపడుతారు.

మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణ, మృతుల సంఖ్య తగ్గింపే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఈ కార్యక్రమం కోసం జిల్లాకు రూ.కోటి కేటాయించి సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతోంది. జిల్లాలో తరచూ జరిగే రోడ్డు ప్రమాద స్థలాలను బ్లాక్‌స్పాట్‌గా గుర్తించింది. వాటిపై శాసీ్త్రయ అధ్యయనం, ప్రమాదాలకు గల కారణాలు, గోల్డెన్‌ అవర్‌లో వైద్యసేవలు, ప్రమాదకర స్థలం ముందే తెలిపే విధంగా గూగుల్‌ మ్యాప్‌ వినియోగం వంటి చర్యల కోసం పోలీసు, కలెక్టర్‌ పర్యవేక్షణలో జిల్లా రహదారి భద్రత టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందానికి ఆర్డీవో, ఏజీపీ, డీటీవో ద్వారా నామినేట్‌ చేసిన ఒక ఎంవీఐ, ఆర్‌అండ్‌బీ డీఈ, ఎన్‌హెచ్‌ఏఐ డీఎం, సంబంధిత రహదారుల అధికారులు, హైదరాబాద్‌–కరీంనగర్‌–రామగుండం రహదారి, ఎన్‌హెచ్‌–363, ఎన్‌హెచ్‌–63, ఎస్‌హెచ్‌–24 ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

రక్తమోడుతున్న దారులు

నిత్యం జిల్లాలో ఏదో ఒక చోట రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులుగా మిగలడం పరిపాటిగా మారింది. మూలమలుపులు, క్రాస్‌రోడ్డు, యూ టర్న్‌ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్లాక్‌స్పాట్ల వద్ద జరిగిన ప్రమాదాల్లోనే మరణాల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. గంటకు వంద కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లే జాతీయ రహదారులపై ప్రమాద ముప్పును ఊహించవచ్చు. కానీ సగటున 50కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లేందుకు అవకాశం లేని రహదారులపై ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పోలీసు పరిభాషలో బ్లాక్‌స్పాట్‌గా పరిగణిస్తారు. జిల్లాలో ఇప్పటివరకు 24బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నట్లు గుర్తించారు. అన్నీ మలుపులు, క్రాస్‌రోడ్లు, యూ టర్న్‌లే కావడం గమనార్హం. 90శాతం ప్రమాదాలు ఇక్కడే జరుగుతున్నాయి. గత 11నెలల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 121మంది మృతిచెందగా, 398మంది తీవ్రంగా గాయపడ్డారు.

గూగుల్‌తో అనుసంధానం

జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల నుంచి బ్లాక్‌స్పాట్ల వివరాలు వచ్చిన తర్వాత సమగ్ర మ్యాప్‌ను గూగుల్‌తో అనుసంధానానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ రహదారిపై ప్రయాణించినప్పుడు స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు యాక్సిడెంట్‌ స్పాట్‌, ప్రమాదకర మూలమలుపు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతానికి చేరుకోవడానికి 500మీటర్ల ముందే గూగుల్‌ నుంచి అలర్ట్‌ మెస్సేజ్‌ వస్తుంది. ప్రస్తుతం రోడ్డు పక్కన బోర్డులు సక్రమంగా లేక వాహనదారుల దృష్టి వాటిపై పడడం లేదు. ఈ నేపథ్యంలో గూగుల్‌ అలర్ట్‌ల ద్వారా అప్రమత్తం అవుతారు.

జిల్లాలోని బ్లాక్‌స్పాట్లు..

నేషనల్‌ హైవే–63పై..

గూడెం, రాయపట్నం బ్రిడ్జి, ఆంధ్రబోర్‌ లక్సెట్టిపేట, ముల్కల్ల బస్టాప్‌, ముల్కల్లబ్రిడ్జి, గుడిపేట 13వ బెటాలియన్‌ పెట్రోల్‌బంక్‌, వేంపల్లి జీపీ కార్యాలయం, మేకలమండి, మేదరివాడ, ఫ్రైఓవర్‌ బ్రిడ్జి, తోళ్లవాగు, నస్పూర్‌గేట్‌, అంబేడ్కర్‌ కాలనీ, తెలంగాణ తల్లి చౌక్‌, సీసీసీ ఎక్స్‌ రోడ్డు, శ్రీరాంపూర్‌ పెట్రోల్‌బంక్‌, శ్రీరాంపూర్‌ జీఎం కార్యాలయం.

నేషనల్‌ హైవే–363పై..

క్రిష్ణకాలనీ అండర్‌బ్రిడ్జి, దొరగారిపల్లె, అందుగులపేట ఈసర్‌ పెట్రోల్‌బంక్‌, యాపల్‌ ఏరియా కేకే–2 మైన్‌ కార్యాలయం, బొక్కలగుట్ట, పులిమడుగు, సోమగూడెం వై జంక్షన్‌, గంగారాంనగర్‌ బెల్లంపల్లి, తిరుమలహిల్స్‌ బెల్లంపల్లి, నయార పెట్రోల్‌పంపు, బోయపల్లి బోర్డు.

స్టేట్‌హైవే–24పై..

పొన్కల్‌బస్టాండ్‌, డీర్‌పార్క్‌ పైడిపల్లి టెంపుల్‌, ముత్యంపేట చెక్‌పోస్టు, నెల్లి వెంకటాపూర్‌ బస్టాప్‌.

నివారణ చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement