బెల్లంపల్లి: భూముల రీసర్వే కచ్చితత్వం, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు అన్నారు. గురువారం మండలంలోని బూధాకుర్ద్ గ్రామంలో భూముల రీ సర్వేను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, బెల్లంపల్లి తహసీల్దార్ కృష్ణ, సర్పంచ్ వాణితో కలిసి పరిశీలించారు. రైతులకు అవగాహన కల్పించి సహకారం తీసుకోవాలని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


