చిక్కులకు చెక్‌! | - | Sakshi
Sakshi News home page

చిక్కులకు చెక్‌!

Nov 26 2026 11:56 PM | Updated on Nov 26 2026 11:56 PM

● జిల్లాలో 81 గ్రామాల్లో భూ రీ సర్వే ● ఇప్పటికే 13గ్రామాల్లో పూర్తి ● భూ వివాదాలకు పరిష్కారం

● జిల్లాలో 81 గ్రామాల్లో భూ రీ సర్వే ● ఇప్పటికే 13గ్రామాల్లో పూర్తి ● భూ వివాదాలకు పరిష్కారం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేతో చిక్కులకు చెక్‌ పడనుంది. భూ వివాదాల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా సర్వే సాగుతోంది. జిల్లాలో మొదట ఎలాంటి నక్ష లేని 11గ్రామాలను ఎంపిక చేసి సర్వే పూర్తి చేశారు. వీటిలో ఓ గ్రామం అటవీశాఖ పరిధిలో ఉండడంతో సర్వే పూర్తి కాలేదు. మిగతా పది చోట్ల పూర్తి చేశారు. దీంతో మరో 70గ్రామాలను రీ సర్వేలో చేర్చారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తంగా 81గ్రామాల్లో సర్వే సాగుతోంది. వీటిలో ఇప్పటివరకు మొత్తంగా 13చోట్ల పూర్తయింది. మిగతా చోట్ల సైతం ఒక్కొక్కటి ప్రారంభిస్తున్నారు. ముందుగా గ్రామస్తులకు అవగాహన కల్పించి తర్వాత క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. జిల్లా భూ సర్వే, కొలతల శాఖ ఆధ్వర్యంలో 18మండలాల్లో 10మంది సర్వేయర్లతో సర్వే జరుగుతోంది. ఏళ్లుగా ఉన్న భూ వివాదాలకు ఓ పరిష్కారం లభించడమే కాకుండా ప్రతీ సర్వే నంబరు విస్తీర్ణంపై ఓ మ్యాపుతో సహా డిజిటలీకరణ పద్ధతిలో రికార్డు అవుతుంది. ఈ మేరకు సర్వేయర్లకు అవసరమైన రోవర్లు సైతం కొనుగోలు చేసి అప్పగించారు.

ప్రభుత్వ భూముల గుర్తింపు

భూముల రీ సర్వేతో ఎన్నో ఏళ్లుగా సరైన రికార్డులు కూడా లేని ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నారు. పాత రెవెన్యూ రికార్డులు, పహాణీలు, సెత్వార్‌, టిప్పన్‌, ఎఫ్‌ఎంబీ, గ్రామ నక్షాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, సబ్‌ డివిజన్లతో పోల్చుతున్నారు. ఏదైనా గ్రామ పరిధిలో సర్వే చేస్తే తొలుత ప్రభుత్వ భూముల హద్దులను గుర్తిస్తున్నారు. తర్వాత ప్రైవేటు భూములను ఆయా హద్దుల్లో సర్వే చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూమి సైతం కచ్చితమైన లెక్కల్లోకి వస్తోంది. దశాబ్దాలుగా సర్వే జరగకపోవడంతో నిజాం కాలం నాటి మ్యాపులే ఇప్పటికీ ఆధారంగా ఉన్నాయి. చాలాచోట్ల హద్దులు చెరిగిపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. సాగు చేస్తున్న కమతం విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. సరిహద్దు రైతుల మధ్య హద్దు సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నా యో ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ క్రమంలో సమగ్ర రీ సర్వేతో భూ సమస్యలు తొలగిపోనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement