బెల్లంపల్లి: ఏకపక్ష నిర్ణయాలు, ఓటర్ల సవరణలో అక్రమాలకు తెరతీసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) జ్ఞానేష్‌కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్ డిమాండ్ చేశారు. గురువారం సీఈసీ రాజీనామా చేయాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల నుంచి పోశమ్మ గడ్డ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ పేరుతో ఎన్నికల సంఘం ప్రజల ఓటు హక్కును కాలరాస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు నిషీద్, గౌతమ్, తిరుపతి, విగ్నేష్, విద్యార్థులు పాల్గొన్నారు.


