శ్రీరాంపూర్: సింగరేణి గోడలు వ్యాపార ప్రచారాల కు అడ్డాగా మారుతున్నాయి. రూపాయి ఖర్చు లే కుండా వ్యాపారులు కంపెనీ ఆస్తులను యథేచ్ఛగా వాడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లే దు. శ్రీరాంపూర్ ఏరియాలోని కంపెనీ క్వార్టర్లు, గ నులు, క్లబ్‌లు, కార్యాలయాల గోడలన్నీ వ్యాపా ర ప్రచారాలతో నిండిపోతున్నాయి. ఏ గోడ చూసి ఏదో ఒక వ్యాపార ప్రచారాలు దర్శనమిస్తుంది. వస్త్ర వ్యాపారులు, హార్డ్‌వేర్స్, టీవీ, ఎలక్ట్రీకల్స్ వ స్తువుల షోరూంలు, విద్యాసంస్థల ప్రకటనలు గోడలపై రాస్తున్నాయి. పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. కంపెనీ ఆస్తులు సుందరంగా కనిపించాలనే ఉద్దేశంతో రూ.లక్షలు వెచ్చించి పెయింటింగ్స్ వేయిస్తుంటే నేడు వ్యాపార ప్రకటనలు వాటి అందాన్ని మసకబారుస్తున్నాయి. ప్రతీ మూడేళ్లకోసారి కంపెనీ సొంత ఖర్చులతో పేయింట్స్ చేయిస్తుంటుంది. ఒక్కోసారి గోడలకు మరమ్మతు జరిగిన కూడా సంబంధం లేకుండా రంగులు వేయిస్తుంటారు. దీని కోసం కంపెనీ ప్రత్యేకంగా టెండర్ పిలిచి ఈ పనులు చేపడుతోంది.
నోటీసులు ఇవ్వరు
వ్యాపారులు, వ్యాపార సంస్థలకు కంపెనీ అధికారులు కనీసం నోటీసులు ఇవ్వడం లేదు. దీంతో వారికి అడ్డూఅదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు వాల్ రైటింగ్ చేసుకుంటూ పోతున్నారు. ఈ వ్యాపార ప్రచారా ల పెయింటింగ్స్‌ను అరికట్టి కంపెనీ గోడలను రక్షించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకోవాలి
కంపెనీ గోడలపై వ్యాపార ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లక్షలు ఖర్చు చేసి పెయింటింగ్స్ చేస్తున్న అవి కొన్నిరోజులకే చెడిపోతున్నాయి. అధికారులు స్పందించకుంటే కంపెనీ నష్టం జరుగుతుంది.
– అఫ్రోజ్‌ఖాన్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు


