లింగాపూర్: మండలంలోని పిక్లాతండా గ్రామానికి చెందిన బోడ మల్లేశ్వరి (16) అనారోగ్యం కారణంగా శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉరేసుకొని ఒకరు..
కోటపల్లి: మండలంలోని శెట్‌పల్లి శంకరపూర్ గ్రా మానికి చెందిన పెద్దల బాపు (58) ఈ నెల 11న మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పోలీసులు, కు టుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దల బాపు గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. భార్య అంజమ్మ చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా కుమారుడు కిష్టయ్య, తమ్ముడు మహేందర్ ఇంటికి చేరుకొని చూడగా అప్పటికే మృతి చెందాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


