అదరగొట్టిన ఆదివాసీ జిల్లా | - | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన ఆదివాసీ జిల్లా

Oct 13 2026 12:11 AM | Updated on Oct 13 2026 12:11 AM

బంగారం, వెండి పతకాలు సాధించిన బాలికలు పోటాపోటీగా రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలు బహుమతులు అందించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌రూరల్‌: రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ బాలికల పోటీల్లో ఆదివాసీ కుమురం భీం జిల్లా జట్లు అదరగొట్టాయి. రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ బాలికల పోటీల్లో సబ్‌ జూనియర్‌ విభాగంలో మొదటిస్థానం, జూనియర్‌ విభాగంలో రెండో స్థానం కై వసం చేసుకున్నాయి. మూడు రోజుల పాటు జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో రాష్ట్రస్థాయి బాలికల నెట్‌బాల్‌ పోటీలు జరిగాయి. గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, నెట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు అదిత్య రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అలీబిన్‌, కార్యదర్శి తిరుపతి బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్‌ మహేశ్వర్‌, నెట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి శిరీష, ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌ రావు, నోడల్‌ ఆఫీసర్‌ మీనారెడ్డి, పీడీ మధుసూదన్‌, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

సబ్‌ జూనియర్‌ విభాగంలో కుమురం భీం జట్టు మొదటి స్థానం, మహబూబ్‌నగర్‌ జట్టు రెండో స్థానం, జగిత్యాల జట్టు మూడో స్థానంలో నిలిచాయి. జూనియర్‌ విభాగంలో నల్గొండ మొదటి స్థానం, కుమురం భీం రెండో స్థానం, మహబూబ్‌నగర్‌ మూడో స్థానం కై వసం చేసుకున్నాయి. జాతీయస్థాయి నెట్‌బాల్‌ (జూనియర్‌ విభాగం)పోటీలు డిసెంబర్‌లో మహారాష్ట్రలో, సబ్‌ జూనియర్‌ విభాగం పోటీలు మధ్యప్రదేశ్‌లో ఉంటాయని నెట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యనిర్వహక కార్యదర్శి తిరుపతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement