అక్రమంగా విద్యుత్‌ తీగలు అమర్చిన వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా విద్యుత్‌ తీగలు అమర్చిన వ్యక్తి అరెస్టు

Oct 11 2026 12:09 AM | Updated on Oct 11 2026 12:09 AM

చెన్నూర్‌రూరల్‌: మండలంలోని గంగారంలో పత్తి చేను చుట్టూ అక్రమంగా 11కేవీ విద్యుత్‌ తీగ అమర్చిన రాంటెంకి ఎర్రయ్యను శనివా రం అరెస్టు చేసినట్లు చెన్నూర్‌ పట్టణ సీఐ బన్సీలాల్‌ తెలిపారు. ఎర్రయ్య తన పత్తి చేను చుట్టూ అటవీ జంతువులు రాకుండా అక్రమంగా 11కేవీ విద్యుత్‌ లైన్‌ నుంచి కనెక్షన్‌ తీసుకుని తీగ అమర్చాడు. రాత్రి సమయంలో గోదరి మల్లయ్య అటు వైపు వెళ్లడంతో షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి బాధ్యుడైన ఎర్రయ్యను అదుపులో తీసుకుని అతని నుంచి విద్యుత్‌్‌ తీగ, కొయ్యలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement