కార్మికులకు 36 శాతం వాటా చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు 36 శాతం వాటా చెల్లించాలి

Oct 11 2026 12:09 AM | Updated on Oct 11 2026 12:09 AM

రెబ్బెన: సింగరేణి గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలు వెంటనే ప్రకటించి కార్మికులకు 36 శాతం వాటా చెల్లించాలని టీబీజీకేఎస్‌ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు డిమాండ్‌ చేశారు. టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో శనివారం గోలేటి సీహెచ్‌పీలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది 34 శాతం వాటా చెల్లించగా ఈసారి 36 శాతం చెల్లించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.25 వేలు చెల్లించాలని అన్నారు. ఏఐటీయూసీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని అన్నారు. గోదావరిఖనిలో ఈనెల 14న సింగరేణి కార్మిక గర్జన పేరిట నిర్వహించే సభకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరవుతారని తెలిపారు. సెంట్రల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మంగీలాల్‌, ఏరియా కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఓరం కిరణ్‌, ఫిట్‌ కార్యదర్శి సమ్మయ్య, నాయకులు శ్రీనివాస్‌, మాజీ ఫిట్‌ కార్యదర్శి మెరుగు రమేశ్‌, ఏరియా నాయకులు కృష్ణ, మహిళా నాయకురాలు వరలక్ష్మి, జ్యోతి, ఆఫీస్‌ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి, నాయకులు విద్యాసాగర్‌, మురళీకృష్ణ, చిరంజీవి, దేవేందర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement