బెల్లంపల్లి: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే జి.వినోద్ డిమాండ్ చేశారు. శనివారం బెల్లంపల్లి అంబేడ్కర్ చౌరస్తా నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే వినోద్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ అక్రమాలపై ఆందోళన చేస్తున్న లోక్‌సభ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని అరెస్టు చేయడం అక్రమమని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ఓటర్ల నమోదు జరగాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి ప్రభాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


