పత్తి రైతు దిగాలు | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతు దిగాలు

Oct 11 2026 12:09 AM | Updated on Oct 11 2026 12:09 AM

● వర్షం లేక ఎండిన మొక్కలు ● ఆందోళనలో అన్నదాతలు

చెన్నూర్‌రూరల్‌: రైతులు ప్రతీఏటా ఏదోవిధంగా నష్టపోతూనే ఉన్నారు. వానాకాలం సీజన్‌లో తొలకరి జల్లులు కురవగానే ఆశతో పత్తి సాగు చేశారు. పెట్టిన గింజలు మొలకెత్తక పోవడం, రెండో సారి దున్నించి మళ్లీ విత్తారు. చీడ, పీడల నివారణకు పిచికారీ చేసి విసిగిపోయారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. దుక్కులు దున్నించి, విత్తనాలు కొనుగోలు చేయడం, చీడపీడలకు మందులు పిచికారీ చేయడం, ఎరువులకు సుమారు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం పూత, కాయ దశలో ఉంది. ఒక్క సారి వర్షం కురిస్తే ఈ పంటకు ప్రాణం పోసినట్లు ఉంటుంది. కానీ వానలు లేక పూత, కాయ దశకు చేరుకున్న మొక్కలు ఎండిపోతున్నాయి. ఇలా అయితే దిగుబడి రాక నష్టాల పాలు కావాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు బోర్ల ద్వారా నీటి తడులు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement