అంచనాలు తలకిందులు! | - | Sakshi
Sakshi News home page

అంచనాలు తలకిందులు!

Oct 11 2026 12:09 AM | Updated on Oct 11 2026 12:09 AM

ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో గురితప్పిన బాణం అధికార పార్టీకి ఎదురుదెబ్బ ఆదిలాబాద్‌ రీజియన్‌లో ఈయూ కూటమి క్లీన్‌స్వీప్‌

మంచిర్యాలఅర్బన్‌: ఆర్టీసీ ఎన్నికల్లో ఊహించని పరాజయంతో అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో తీవ్ర అంతర్మథనం మొదలైంది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బాణం గుర్తును కొత్తగా టీడబ్ల్యూయూ కూటమికి కేటాయింపు.. అగ్రనేతలతో ప్రచారం నిర్వహించిన అంచనాలు తలకిందులయ్యాయి. గతంలో టీఎంయూకు చెందిన ప్రాచుర్యం పొందిన బాణం గుర్తును ఈసారి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉన్న (టీడబ్ల్యూయూ) దక్కించుకుంది. కార్మికులు గుర్తును చూసి కాకుండా టీఎంయూ నిచ్చెనకు ఓటేశారు. ఆదిలాబాద్‌ రీజియన్‌లో ఏఐటీయూసీ అనుబంధ యూనియన్‌ ఈయూ–టీఎంయూ, ఎన్‌ఎంయూ జతకట్టిన ఐక్య కూటమి ఆధిపత్యంతో టీడబ్ల్యూయూ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

నాడు టీడీపీ–నేడు కాంగ్రెస్‌

అనుకున్నట్లే 2001లో సీన్‌ రిపీట్‌ అయింది. అప్పటి టీడీపీ అనుబంధ టీఎన్‌టీయూసీ ఆర్టీసీ ఎన్నికల్లో ఏవిధంగా ఘోర పరాజయం పాలైందో నేడు మద్దతుదారులకు కూడా సరిగ్గా అదే తరహాలో షాక్‌ తగిలింది. అధికార బలం, ముమ్మర ప్రచారాలను పక్కనబెట్టి ఈయూ కూటమికి పట్టం కట్టడంతో అధికార పార్టీకి కార్మిక సంఘాల్లో రాజకీయ జోక్యం చెల్లదని తేల్చిచెప్పింది. అధికార కాంగ్రెస్‌ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ (టీడబ్ల్యూయూ)కు పూర్తి మద్దతు ప్రకటించి ఆగ్రనేతల ప్రచారం నిర్వహించిన పరాజయం తప్పలేదు. అప్పట్లో ఆర్టీసీ కార్మిక పరిషత్‌(టీఎన్‌టీయూసీ)ని బరిలోకి దింపిన ఎన్‌ఎంయూ 1502 మెజార్టీతో విజయబావుటా ఎగురవేసింది. టీఎన్‌టీయూసీ 854 ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ మద్దతుతో నిలిచిన టీఎంయూకు 469తో రెండో స్థానానికి పరిమితం కాగా అప్పట్లో గెలుపొందిన ఎన్‌ఎంయూతో జతకట్టిన టీఎంయూ, ఈయూ ఐక్యకూటమి 1147 ఓట్లుతో హవా కొనసాగించింది. అప్పుడు ఇప్పుడు అధికార పార్టీ మద్దతు ప్రకటించిన గుర్తింపు ఎన్నికల్లో కీలకంగా కేంద్రమాజీ మంత్రి వేణుగోపాలాచారి(ప్రచార బాధ్యతలు) వ్యవహరించడం కొసమెరుపు.

ఈయూ కూటమి క్లీన్‌స్వీప్‌

ఆదిలాబాద్‌ రీజియన్‌లో రాష్ట్రస్థాయి గుర్తింపు, క్లాస్‌–3లో మొత్తం 1773 ఓట్లలో ఈయూ కూట మికి 1229 ఓట్లు రాగా టీడబ్ల్యూయూ యూని యన్‌ 425కు పరిమితం కావటంతో ఎంప్లాయిస్‌ యూనియన్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. డిపోల వారీగా చూస్తే మంచిర్యాలలో బాణంపై (టీడబ్ల్యూ యూ) గుర్తుపై పోటీ చేసిన నిచ్చెన(టీఎంయూ) 30, ఆదిలాబాద్‌లో 145, నిర్మల్‌లో 282, భైంసాలో 174, ఆసిపాబాద్‌లో 65, ఉట్నూర్‌ 3 ఓట్లతో అధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయిలో పోటీ చేసిన ఈయూ(బస్సు), టీడబ్ల్యూయూ(బాణం) గుర్తుపై మంచిర్యాలలో 102, ఆదిలాబాద్‌లో 162, నిర్మల్‌లో 282, భైంసాలో 171, ఆసిఫాబాద్‌లో 80, ఉట్నూర్‌ 13 మెజార్టీతో గెలుపొందినట్లు తెలుస్తోంది. అంకెలు అటూ ఇటైనా ఎన్నికల ఫలితాలు మాత్రం 17న అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఫలి తాల అనంతరం కార్మికుల క్షేత్రస్థాయి సమస్యలను హక్కులు గుర్తించడంలో ఎక్కడ లోపం జరిగిందనే అంశంపై అధికార పార్టీ నాయకత్వం తీవ్రంగా చర్చిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement