● నవంబర్‌ నుంచి అదనపు చార్జీలు ● యూనిట్‌కు 50పైసల వరకు పెంపు ● వడి ్డంచేందుకు సిద్ధమైన విద్యుత్‌శాఖ ● ఆందోళనలో జిల్లా వినియోగదారులు | - | Sakshi
Sakshi News home page

● నవంబర్‌ నుంచి అదనపు చార్జీలు ● యూనిట్‌కు 50పైసల వరకు పెంపు ● వడి ్డంచేందుకు సిద్ధమైన విద్యుత్‌శాఖ ● ఆందోళనలో జిల్లా వినియోగదారులు

Oct 6 2026 11:59 PM | Updated on Oct 6 2026 11:59 PM

● నవంబర్‌ నుంచి అదనపు చార్జీలు ● యూనిట్‌కు 50పైసల వరకు పెంపు ● వడి ్డంచేందుకు సిద్ధమైన విద్యుత్‌శాఖ ● ఆందోళనలో జిల్లా వినియోగదారులు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లా విద్యుత్‌ వినియోగదారులపై చార్జీల భారం పడనుంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యులకు విద్యుత్‌శాఖ ట్రూ–అప్‌ చార్జీల రూపంలో కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది. నవంబర్‌ నుంచి ఒక్కో యూనిట్‌పై 30పైసలు, డిసెంబర్‌లో 50 పైసల చొప్పున పెంచనుండగా నెలకు రూ.వందల్లోనే అదనపు భారం పడనుంది. ప్రస్తుత ఎండలు వేసవిని తలపిస్తుండడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నిరంతరం వినియోగిస్తుండడంతో గృహ, వ్యాపార అవసరాలకు వాడకం పెరిగింది. దీంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. గృహజ్యోతి లబ్ధిదారులపైనా భారం పడనుంది. ఇప్పటికే గ్యాస్‌, బియ్యం, నిత్యావసరాల ధరలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబీకులు బతకడమే కష్టంగా మారింది. రోజువారీ కూలీల పరిస్థితి మరీ దారుణంగా మారనుంది.

గిర్రున తిరుగుతున్న మీటర్లు

జిల్లాలో ఎనిమిది కేటగిరీలకు సంబంధించి 3,73,334 విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. పెరిగిన ఎండ ల తీవ్రతతో ప్రస్తుతం రోజుకు 3.220 నుంచి 3.340 మిలియన్‌ యూనిట్లను వినియోగదారులు వాడుతున్నారు. ఈ లెక్కన నెలకు 90.400 నుంచి 100.200 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. గృహజ్యోతి పథకం ద్వారా ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. ఈ పథకం కింద 1,35,260 కనెక్షన్లున్నా యి. ఉక్కపోత భరించలేక ఇళ్లల్లో కూలర్లు, ఏసీలు గంటల తరబడి ఆన్‌ చేయాల్సి వస్తుండగా మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. గృహజ్యోతి లబ్ధిదారులు 200కు పైగా యూనిట్లు వినియోగిస్తే అదనపు చార్జీల భారం తప్పదు. నెలకు 200 నుంచి 300 యూనిట్లు వాడే సగటు మధ్యతరగతి కుటుంబంపై నవంబర్‌లో రూ.60 నుంచి రూ.90 వరకు, డిసెంబర్‌ నుంచి రూ.100కు పైగా అదనంగా భారం పడుతుంది. వ్యాపారులు, పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్‌ కనెక్షన్లున్న చిరువ్యాపారులు, షోరూంల యజమానులపై ఈ భారం రూ.వేలల్లో పడనుంది. దీంతో జిల్లా వినియోగదారులపై రూ.2.20 నుంచి రూ.2.70 కోట్ల భారం పడునుంది.

ట్రూ–అప్‌ చార్జీలు అంటే..

గతంలో విద్యుత్‌ కొనుగోలు, పంపిణీ సరఫరా వ్యయం అనుకున్న దానికంటే ఎక్కువైనపుడు.. ఆ వ్యత్యాస మొత్తాన్ని నియంత్రణ మండలి అ నుమతితో డిస్కం ట్రూ–అప్‌ చార్జీల రూపంలో వసూలు చేశాయి. ఈ రికవరీ కొనసాగనుంది. డిస్కంల నష్టాలను పూడ్చుకోవడానికి వినియోగదారులపై భారం మోపనున్నారు. నవంబర్‌ నుంచి ఇచ్చే కరెంట్‌ బిల్లుల్లో సాధారణ టారిఫ్‌తో కలపకుండా ట్రూ–అప్‌ చార్జీలను ప్రత్యేకంగా బి ల్లుపై ముద్రించనున్నారు. ట్రూ–అప్‌ మొత్తాన్ని వసూలు చేసేందుకు టీజీఎన్పీడీసీఎల్‌కు 26నెలలు ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement