చెన్నూర్: బ్యాంక్‌లు, గోల్డ్‌షాపులు, ఏటీఎంల వద్ద సెక్యూరిటీని నియమించుకోవాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ సూచించారు. స్థా నిక ఎస్‌ఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో మంగళవా రం రాత్రి బ్యాంక్ అధికారులు, గోల్డ్ షాపు ల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గోల్డ్, బ్యాంక్‌లు, ఏటీఎంల వ ద్ద భద్రత కోసం అధికారులు, వ్యాపారుల కు పలు సూచనలు చేశారు. ప్రతీ బంగారం షా పు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకో వాల ని సూచించారు. గోల్డ్, బ్యాంక్‌ల వద్ద దొంగలు వినియోగదారులను ఏమార్చి చోరీలకు పాల్పడే అవకాశముందని తెలిపారు. బ్యాంక్‌లు, షాపుల వద్ద అనుమానితులు కనిపిస్తే పోలీసులకు తెలుపాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం వచ్చిన వారి వి వరాలు పోలీసులకు తెలుపాలని పేర్కొన్నా రు. ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్, ఘటనలు చో టు చేసుకోక ముందే రానున్న విపత్తు నుంచి బయటపడోచ్చని వివరించారు. చెన్నూర్, కో టపల్లి సీఐలు బన్సీలాల్, కృష్ణ పాల్గొన్నారు.


