పాఠశాలలు అవసరమైన ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తే టీఎస్‌యూటీఎఫ్ స్వాగతిస్తుంది. టీపీఎస్ ఏర్పాటు చేసే ప్రాంతానికి దగ్గరగా ఉన్న పాఠశాలలను మూసివేస్తే వ్యతిరేకిస్తాం. విద్యాహక్కు చట్ట ప్రకారం పాఠశాలలు అందరికీ అందుబాటులో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం అమలులో భాగంగా పాఠశాలలను కుదించే ప్రయత్నం చేస్తోంది. ఈ విధానం సరికాదు. ప్రాథమిక పాఠశాలలకు మరణశాసనంగా మారిన జీవో 25ను సవరించాలి. ప్రతీ ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు, 50మంది విద్యార్థులున్న పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. – రాజావేణు,
టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి


