మంచిర్యాలటౌన్: జిల్లాలోని డబుల్ బెడ్రూం ఇళ్లను దసరా నాటికి లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్, మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలోని డబుల్ బెడ్రూం ఇళ్లను మంగళవారం గృహ నిర్మాణశాఖ పీడీ, డీఈ, ఏఈతో కలిసి సందర్శించారు. పెండింగ్ పనులు, తాగునీరు, విద్యుత్, డ్రెయినేజీ, పారిశుద్ధ్య తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. మిగతా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్ అన్వేశ్, అసిస్టెంట్ కమిషనర్ రాజు, తహసీల్దార్ రఫతుల్లా హుస్సేన్ పాల్గొన్నారు.


