మూడు దశాబ్దాల క్రితం బల్దియాగా ఏర్పాటైన మందమర్రి పంచాయతీ ఇప్పటిదాకా ఎన్నికలు జరగని దుస్థితి హామీలు విస్మరిస్తున్న ప్రజాప్రతినిధులు
మందమర్రిరూరల్: మందమర్రి 30ఏళ్ల క్రితం ము న్సిపాలిటీగా ఏర్పడినా ఇప్పటివరకు ఎన్నికలు ని ర్వహించలేదు. దీంతో పట్టణంలో అభివృద్ధి కుంటుపడుతోంది. శాసనసభ ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఆయా పార్టీల అభ్యర్థులు మున్సిపాలిటీ ఎన్నికలు జరిపిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత మరిచిపోతూనే ఉన్నారు. గ్రామపంచాయతీగా ఉన్న మందమర్రిని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి 21 అక్టోబర్ 1993న నోటిఫైడ్ ఏరియాగా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నోటిఫైడ్ చైర్మన్‌గా సంజీవరావు ఎన్నికయ్యారు. 8 మే 1995లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్ గ్రేడ్–3 మున్సిపాలిటీగా ప్రకటించారు. పట్టణం కొత్త కళ సంతరించుకుంటుందని, ఎన్నికలు జరిగి ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది.
1998లో నోటిఫికేషన్ జారీ అయినా..
మున్సిపాలిటీగా ఏర్పడిన మూడేళ్ల తర్వాత 1998 లో అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో తొలిసా రి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. పట్టణాన్ని 24వార్డులుగా విభజించి చైర్‌పర్సన్ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేశారు. ఎన్నికలకు ఐదురోజుల ముందు మున్సిపాలిటీ పరిధి 1/70 యాక్ట్ గిరిజన చట్ట పరిధిలో ఉందని, చైర్‌పర్సన్ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించాలని గిరిజన నాయకుడు, అప్పటి మా జీ సర్పంచ్ మద్ది రాంచందర్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నికలు నిలిపివేస్తూ కోర్టు స్టే విధించడంతో ఆశావహుల ఆశలు కలగానే మిగిలాయి. కొన్నేళ్లకు రిజర్వేషన్ కోసం కోర్టుకు వెళ్లిన గిరిజన నాయకుడు చనిపోయి స్టే వీగిపోయినా ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడం గమనార్హం.
ఎమ్మెల్యేలు స్థానికేతరులు కావడంతోనే..
చెన్నూర్ నియోజకవర్గం నుంచి స్థానికేతరులే ఎమ్మెల్యేలుగా గెలుపొందడం, వారు స్థానికంగా ఉండకపోవడంతో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలున్నాయి. అభివృద్ధి ని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. మందమర్రి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల కు అతీతంగా కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఐక్యం కావాలని, ప్రభుత్వం దిగి వచ్చే దాకా ఉద్య మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన చిక్కులను కేంద్ర ప్రభుత్వానికి తెలిపి రిజర్వేషన్ ఏదైనా సరే ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేసేలా చూడాలని కోరుతున్నారు.
ఆమరణ దీక్షకై నా సిద్ధమే..
మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడంతో ప్రజాప్రతినిధులు లేక అభివృద్ధి జరగడం లేదు. నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. స్థానికంగా అన్ని పార్టీలు, ప్రజా, కుల, స్వచ్ఛద సంఘాల నాయకులను కలుపుకొని ఆమరణ దీక్ష చేయడానికై నా సిద్ధంగా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
– వాసాల సంపత్, స్థానికుడు
ప్రజాప్రతినిధులు లేక ఇష్టారాజ్యం
మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ సీఈవో, మున్సిపల్ కమిషనర్‌తో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఆధారంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే అండదండలతో సదరు పార్టీ నాయకులతోనే ఇష్టారీతిగా పనులు జరుగుతున్నట్లు ఆరోపలున్నా యి. అనుభవం లేని కాంట్రాక్టర్‌కు అభివృద్ధి పనులు అప్పగించారని, దీంతో పనుల్లో నా ణ్యత లోపిస్తోందని చెబుతున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని విమర్శిస్తున్నారు.


