అక్రమాస్తులు కూడబెట్టుకున్న బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమాస్తులు కూడబెట్టుకున్న బీఆర్‌ఎస్‌

Oct 6 2026 11:59 PM | Updated on Oct 6 2026 11:59 PM

● రాష్ట్ర మంత్రి వివేక్‌వెంకటస్వామి ● మందమర్రి పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మందమర్రిరూరల్‌: బీఆర్‌ఎస్‌ హయాంలో ఆ పార్టీ నాయకులు అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని రా ష్ట్ర గనులు, కార్మిక ఉపాధిశాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆరోపించారు. వారి అక్రమాలు ఒక్కొక్కొటిగా బయటకు వస్తాయని పేర్కొన్నారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేటీఆర్‌ ఆస్తులు పెంచుకోవడంలో పెట్టిన శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంలో పెట్టలేదని ఆరోపించారు. కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌లు నిర్మించారని విమర్శించారు. రాజకీయాల కోసం సీఈసీని కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ స్వచ్ఛందగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి ప్రాంతంలో కొత్త గనులు రావాల్సి ఉందని తెలిపారు. ఇందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే కమిటీ వేసి సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని తెలిపారు. కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాల పెంపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాలతోనే సింగరేణిలో కొత్త గనులు రాలేదని ఆరోపించారు. సంస్థ పురోభివృద్ధికి నూతన గనుల ఏర్పాటు తప్పదని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement