మంచిర్యాలక్రైం: ప్రతీ ఫిర్యాదుపై చట్ట పరిధి లో సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సోమవారం రా మగుండం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి బాధితుల సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కే.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.


