అటవీభూముల ఆక్రమణ నేరం | - | Sakshi
Sakshi News home page

అటవీభూముల ఆక్రమణ నేరం

Oct 6 2026 12:06 AM | Updated on Oct 6 2026 12:06 AM

జన్నారం: అటవీ భూమి ఆక్రమణ, విక్రయం చట్టరీత్యా నేరమని, అందుకే ఆక్రమిత భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని ఎఫ్‌డీవో రామ్మోహన్‌ తెలిపారు. సోమవారం ఎఫ్‌డీవో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్నారం అటవీ డివిజన్‌ ఇందన్‌పల్లి రేంజ్‌ కలమడుగు బీట్‌ పరిధిలోని మురిమడుగు గ్రామం కంపార్టుమెంట్‌ నంబర్‌ 233లో 13 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2012లో టైగర్‌జోన్‌ ఏర్పాటు తర్వాత కలమడుగు బీట్‌లో 530 ఎకరాలకు గాను 200 ఎకరాలు అటవీ హక్కుల కింద ఇచ్చారని, మరో 330 ఎకరాలు ఆక్రమణకు గురైందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement