చెన్నూర్: ‘ముడుపులు చెల్లిస్తేనే యూరియా’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం వ్యవసాయ శాఖలో కలకలం సృష్టించింది. డీఏవో సురేఖ స్పందించి ఇండెట్ల పేరుతో ఫోన్ పే ఎలా తీసుకున్నారో వివరణ ఇవ్వాలని ఏడీఏ బానోత్ ప్రసాద్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. డబ్బులు తీసుకున్న విషయం నిజమేనని తెలిసినా చర్యలు తీసుకోకుండా షోకాజ్ నోటీసుతో సరిపెట్టడం చెన్నూర్, కోటపల్లి మండలాల్లో చర్చనీయాంశంగా మారింది. డీఏవో సైతం ఏడీఏ నుంచి డీఏవోగా బాధ్యతలు చేపట్టడంతో బలమైన చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేశారని డీలర్లు ఆరోపిస్తున్నారు. కాగా, జిల్లాలోని రైతులకు 25.146.94 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యిందని డీఏవో తెలిపారు.


