పకడ్బందీగా మూల్యాంకనం | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా మూల్యాంకనం

Oct 6 2026 12:06 AM | Updated on Oct 6 2026 12:06 AM

ఒక బడి పేపర్లు.. మరో స్కూల్‌ టీచర్‌కు..

ఎమ్మార్సీలు, జెడ్పీ పాఠశాలల్లో కేంద్రాలు

గోప్యంగా 9వ తరగతి సమాధాన పత్రాల పరిశీలన

మంచిర్యాలఅర్బన్‌: పరీక్ష వ్యవస్థలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. జిల్లాలో తొమ్మిదో తరగతి సమ్మేటివ్‌ అసెస్‌మెంటు జవాబు పత్రాల మూల్యాంకనం అత్యంత గోప్యంగా సాగుతోంది. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆయా పాఠశాలల నుంచి సబ్జెక్టు ఉపాధ్యాయులను పిలిపించి మరుసటి రోజు పేపర్లు దిద్దే ప్రక్రియ చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఒక పాఠశాల ఉపాధ్యాయుడు మరో స్కూల్‌ జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేలా చర్యలు చేపట్టారు. ఎమ్మార్సీలు, జెడ్పీ పాఠశాలల్లోని మూల్యాంకన కేంద్రాలకు వచ్చే జవాబు పత్రాలను ఉపాధ్యాయులకు సమానంగా అందజేసి పకడ్బందీగా దిద్దిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రయ్య పర్యవేక్షణలో బాహ్య మూల్యాంకన తీరును డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్‌రెడ్డి, ఎంఈవోలు ఎప్పటికప్పుడు పరిశీలి స్తున్నారు. తక్కువ పాఠశాలలు ఉన్న మండలాల్లో మండల వనరుల కేంద్రాలు(ఎమ్మార్సీలు), ఎక్కువ స్కూళ్లు ఉన్న చోట ఉన్నత పాఠశాలల్లో మూల్యాంకనం నిర్వహిస్తున్నారు.

బాహ్య మూల్యాంకనం

జిల్లాలో ఒకటి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్‌ అసెస్‌మెంటు పరీక్షలు అక్టోబర్‌ ఒకటి నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 73,806 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు 22,984 మంది, 6నుంచి 10వ తరగతి వరకు 50822 మంది చదువుతున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలలు 108, ఐదు మోడల్‌స్కూళ్లు, 18 కేజీబీవీలు, టీజీఆర్‌ఐఈఎస్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్నారు. ఇప్పటివరకు స్కూల్‌ స్థాయిలోనే పేపర్లు దిద్దడం వల్ల కొన్నిసార్లు ఉపాధ్యాయులు పక్షపాతం చూపుతున్నారనే అనుమానాలు ఉండేవి. కొత్తగా బాహ్యమూల్యాంకన విధానం వల్ల విద్యార్థి నిజమైన ప్రతిభ బయటపడుతుందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 9వ తరగతికే పరిమితమైన ఈ ట్రయల్‌ రన్‌ విధానాన్ని విజయవంతం చేసి రాబోయే ఎఫ్‌ఏ–2 పరీక్షల్లో 6నుంచి 9వ తరగతి వరకు ఇదే రీతిలో దిద్దించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఉపాధ్యాయులపై బాధ్యత పెరగడంతోపాటు విద్యార్థులు ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నారో స్పష్టంగా తెలిసి లోపాలను సరిదిద్దే అవకాశం లభిస్తుంది. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. డిజిటల్‌ మార్కుల విశ్లేషణ ఆధారంగా ఏ ఉపాధ్యాయుడు ఏ విషయాల్లో విద్యార్థులను తీర్చిదిద్దాలో, ఏ సబ్టెక్టులో విద్యార్థులు బలహీనంగా ఉన్నారో సులభంగా గురిస్తారు.

ఆన్‌లైన్‌లో మార్కులు

పబ్లిక్‌ పరీక్షలకు ముందుగానే 9వ తరగతి లో బాహ్య మూల్యాంకనం అలవాటు పడ డం వల్ల విద్యార్థుల్లో పరీక్షల భయం పోతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. బాహ్య మూల్యాంకనం(ఎక్స్‌టర్నల్‌ ఎవా ల్యూయేషన్‌) పూర్తయిన వెంటనే మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. అక్టోబర్‌ 9వరకు మూ ల్యాంకనం పూర్తి చేసి పేపర్లన్నింటిని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందజేస్తారు. పాఠశాల విద్యలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు రోబోయే వార్షిక పరీక్షలకు విద్యార్థులను సమర్థవంతంగా సిద్ధం చేయడానికి ఈ విధానం మైలురాయిగా నిలువనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement