మంచిర్యాలటౌన్: కేయూలో శనివారం నిర్వహించిన బాక్సింగ్ ఎంపిక పోటీల్లో మంచిర్యా ల ఖేలో ఇండియా బాక్సింగ్ కేంద్రం బాక్సర్లు ప్రతిభ కనబర్చారు. రక్షిత్ 50–55 కేజీ కేటగిరీలో, సంస్కృతి 54–57 కేజీ కేటగిరీలో ప్రతిభ కనబర్చి ఆలిండియా యూనివర్సిటీ బాక్సింగ్ చాంపియన్‌షిప్–2026కు అర్హత సాధించినట్లు కోచ్ చిలువేరు రాజేశ్ తెలిపారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జి.హనుమంతరెడ్డి, కోచ్‌లు వారిని అభినందించారు.
బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్
చెన్నూర్: ప్రధాని నరేంద్రమోదీ 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, ప్రధానిగా సేవలందించిన సందర్భంగా ‘సేవ నా భాగస్వామ్యం’ కార్యక్రమంలో భాగంగా శనివారం స్వచ్ఛభారత్ నిర్వహించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపా రు. స్థానిక జలాల్ పెట్రోల్ బంక్ ఎదుట గల అభినవ పోతన బిరుదాంకితులు వానమామౖ లె వరదాచార్యుల విగ్రహం వద్ద బీజేపీ నాయకులు పిచ్చి మొక్కలు తొలగించారు. విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శివకృష్ణ, వెంకటనర్సయ్య, నాయకులు వెంకటేశ్, శ్రీనివాస్, ప్రసాద్, మధురాజ్, తదితరులు పాల్గొన్నారు.


