శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్‌ఆర్‌పీ– 3 గనిలో సపోర్టుమెన్ దుర్గం శంకర్ గాయపడ్డాడు. శనివారం ఉదయం షిఫ్ట్‌కు హాజరైన అతడు ఉపరి తలంలో కటింగ్ మిషన్‌తో ఇనుప పైపు కట్ చేస్తున్నాడు. ప్రమాదశాత్తు కుడి చేయికి తాకి బొటన వే లు కట్ అయింది. తోటి కార్మికులు ఆర్కే–8 డిస్పెన్సరీకి అక్కడి నుంచి రామకృష్ణపూర్ ఏరియాస్పత్రి కి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించా రు. గని మేనేజర్ వెంకట్రావు, రక్షణ అధికారి మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గా యపడిన కార్మికుడిని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, బ్రాంచి కార్యదర్శి షేక్ బాజీసైదా, ఫిట్ సెక్రెటరీ మురళీచౌదరి, టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, జాయింట్ సెక్రెటరీ పొగాకు రమేశ్ వేర్వేరుగా పరామర్శించారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాల ని ఐఎన్‌టీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షులు చాట్ల అశోక్, ల్యాగల శ్రీనివాస్, సీలం చిన్నయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.


