‘ఎమ్మెల్యే వినోద్‌ రాజీనామా చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యే వినోద్‌ రాజీనామా చేయాలి’

Oct 4 2026 8:44 AM | Updated on Oct 4 2026 8:44 AM

వేమనపల్లి: ప్రజల కష్టాలను పట్టించుకోని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ డిమాండ్‌ చేశారు. మండలంలోని బుయ్యారంలో భూవివా దంపై హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రావడంపై శనివారం గ్రామస్తులతో సమావేశమయ్యారు. భూ ముల్లో రైతులతో కలిసి నాగళ్లు కట్టి దుక్కి దున్ని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 166 సర్వేనంబర్‌ భూమిలో పట్టాలు న్నా రైతులను అటవీ అధికారులు బెదిరిస్తే ఫారెస్టు కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు తిరుపతి, కేశవరెడ్డి, లావణ్య, శ్రావణ్‌, నవీన్‌, ముల్కల్ల సత్యనారాయణ, జుమ్మడి వెంకటేష్‌, శంకర్‌, గోగర్ల లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement