మంచిర్యాలఅర్బన్: పదోతరగతి పరీక్షాపత్రా ల మూల్యాంకన భత్యాలు, ఇతర పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కేంద్రంలోని కార్మె ల్ హైస్కూల్ కేంద్రం వద్ద టీటీజేఏసీ, యూ ఎస్‌పీసీ, జాక్టో ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో టీచ ర్లు నిరసన తెలిపారు. 2025లో నిర్వహించిన ఎస్సెస్సీ పరీక్షాపత్రాల మూల్యాంకనం, అక్టోబర్ 2024లో నిర్వహించిన గణనకు సంబంధించిన రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లుగా ఎస్సెస్సీ స్పాట్ రెమ్యూనరేషన్ రూ.10 పెంపు జరగటం లేదని, ఇంటర్ బోర్డు రెండుసార్లు రెమ్యూనరేషన్ పెంచిందని గుర్తు చేశారు. ప్రస్తుత సంవత్సరం నిర్వహిస్తున్న ఎస్సెస్సీ పరీక్షాపత్రాల మూ ల్యాంకనానికి రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని, అసిస్టెంట్ స్పాట్ క్యాంపు అధికారి తిరుపతిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కా ర్యక్రమంలో యూఎస్‌పీసీ నాయకులు రాజా వేణు, జయకృష్ణ, సత్యనారాయణ, సంజీవ్, రమేశ్, టీటీజేఏసీ నాయకులు వేణుగోపాల్, శంకర్, మోహన్, తిరుపతి, జాక్టో నాయకులు వెంకటేశ్వర్లు, కృష్ణ, రమేశ్ రాథోడ్, రాజ గోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


