బీసీల డిమాండ్లు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

బీసీల డిమాండ్లు నెరవేర్చాలి

Apr 8 2026 7:56 AM | Updated on Apr 8 2026 7:56 AM

పాతమంచిర్యాల: బీసీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని జాతీయ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌ కోరారు. డిమాండ్ల సాధనకు బీసీ సంఘాల నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో మంగళవారం 24 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నీలకంఠేశ్వర్‌రావు, న్యూ ఇండియా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జేవీ రాజు, ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అ ధ్యక్షుడు పెద్దపేట శంకర్‌, తెలంగాణ గంగపు త్ర సంఘం జిల్లా అధ్యక్షుడు నెన్నెల నర్స య్య నాయకులకు పూలమాలలు వేసి శిబిరా న్ని ప్రారంభించారు. అనంతరం వారు మా ట్లాడుతూ.. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల బి ల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో బీసీలకు 50శాతం రి జర్వేషన్‌ కల్పించాలని కోరారు. బీసీల కో సం సామాజిక రక్షణ చట్టం, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉ ద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జాతీయ బీ సీ హక్కుల పోరాట సమితి నాయకులు కర్రె లచ్చన్న, గజెల్లి వెంకటయ్య, మంచర్ల సదా నందం, భిక్షపతి, ఎర్రోళ్ల రాజు, సురేంద్రాచారి, శెట్టిపల్లి గట్టయ్య, అశోక్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement