జన్నారం: ఇసుక కోసం మండల కేంద్రంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ముందుగా బస్టాండ్ నుంచి ఇందిరమ్మ లబ్ధి దారులు డప్పుచప్పుళ్లతో ర్యాలీ నిర్వహించి అనంతరం రోడ్డుపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ.. ఇకో సెన్షిటివ్ జోన్ పేరిట అ టవీశాఖ అధికారులు ఇసుక కోసం వెళ్లే ట్రాక్టర్లను సీజ్ చేస్తూ కేసులు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఇస్తామని ప్రభుత్వం చెబుతుండగా అటవీ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరో పించారు. ఇకనైనా అధికారులు తీరు మార్చుకోకుంటే ఆందోళనలు తీవ్రతరం చే స్తామని హెచ్చరించారు. పోలీసులు సర్దిచెప్పడంతో రాస్తారోకో విరమించారు. ట్రాక్టర్ యజమానుల సంఘం నాయకులు బొంతల లక్ష్మణ్, తిరుపతి, ఫజల్‌ఖాన్, రాజు, రాహూల్, కొత్త తిరుపతి, కేశవులు తదితరులు న్నారు.


