మంచిర్యాలక్రైం: జిల్లాలో మద్యం ప్రియులు తెగ తాగేశారు. సర్కారు ఖజానాకు కాసుల వర్షం కురిపించారు. వారం క్రితం ముగిసిన ఏడాది ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం గతేడాదికంటే రూ.43 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని అధికంగా సేవించారు. వేళాపాలా లేకుండా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. మద్యం వ్యాపారులు గల్లీగల్లీకో బెల్ట్‌షాపు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. మద్యం దుకాణాలు, బార్‌లకు నిర్ణీత సమయాన్ని కేటా యించినా వ్యాపారులు విస్మరిస్తున్నారు. జిల్లాలో కొన్ని బార్‌లు ఉదయం ఆరు గంటలకే మద్యం అ మ్మకాలు కొనసాగిస్తున్నాయి. దీంతో మందుబాబు లకు కావాల్సినంత మందు ఏ సమయంలోనైనా దొరుకుతోంది. జిల్లాలో 73 మద్యం దుకాణాలు, 16బార్‌లు ఉన్నాయి. వీటన్నింటికీ గుడిపేట లిక్కర్ గోదాము నుంచే మద్యం సరఫరా చేస్తుంటారు. డిపో నుంచి వ్యాపారుల ఇన్వాయిస్ ధరపై మద్యం అందిస్తుండగా వాటికి తమ లాభ శాతాన్ని జోడించి ఎమ్మార్పీ ధరకు విక్రయిస్తారు. గత ఆర్థిక సంవత్సరం 2024 మార్చి నుంచి 2025 మార్చి వరకు రూ.708కోట్ల 82లక్షల 9వేల 729 మద్యం అమ్మకా లు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2025 మార్చి నుంచి 2026 మార్చి ఆర్థిక సంవత్సరం వరకు రూ.751కోట్ల 96లక్షల 32వేల 434 విలువైన మ ద్యం తాగేశారు. గతేడాదికంటే ఈసారి రూ.43కోట్ల 14లక్షల 22వేల 641 విలువైన మద్యాన్ని తాగినట్లు ఎకై ్సజ్‌శాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి.
మధ్యతరగతి వారి వాటానే అధికం
మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆ దాయంలో 80శాతం వాటా రెక్కాడితే గాని డొక్కాడని పేదవారి నుంచి మొదలుకుని మధ్యతరగతివా రి నుంచే అని చెప్పుకోవచ్చు. కొందరైతే సాయంత్రం వేళ కూలి డబ్బులతో నేరుగా మద్యం షాపుల కే చేరుతున్నారు. దీంతో ఆ కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. మద్యానికి బానిసైన వారి పిల్ల ల భవిష్యత్‌పై ఈ ప్రభావం పడుతోంది. తండ్రి తా గుడుకు బానిస కావడంతో స్కూల్ ఫీజులు కట్టలేక పిల్లలు చదువు మానేసి బాలకార్మికులుగా మారుతున్నారు. అతిగా మద్యం సేవించడంతో లివర్, కి డ్నీ వ్యాధుల బారిన పడుతూ చాలా మంది మరణిస్తుండగా వారి కుటుంబాల్లోని మహిళలు ఒంటరిగా, పిల్లలు అనాథలుగా మారుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
మద్యం విక్రయాల్లో సమయపాలన పాటించాలి. ఎవరైనా మద్యం ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ ధరలకు విక్రయించినా, మద్యం కల్తీ చేసినా కఠినచర్యలు తప్పవు. గుడుంబా, గంజాయి సేవించేవారు, విక్రయించే వారి వివరాలు స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ అధికారులకు తెలిపితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఎకై ్సజ్ శాఖ నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– కేజీ నందగోపాల్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి
ఆర్థిక సంవత్సరం లిక్కర్ కేసులు బీరు కేసులు రూ.విలువ
బెల్ట్‌షాపులే ప్రధానం
మద్యం అమ్మకాల్లో సింహభాగం బెల్ట్‌షాపుల్లోనే జరుగుతుంటాయి. నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్వహిస్తున్నా నియంత్రించడంలో ఎకై ్సజ్ అధికారులు విఫలమవుతున్నారు. మద్యం విక్రయాలు ప్రతినెలా పెంచాలనే లక్ష్యం ప్రభుత్వమే విధించింది. దీంతో ఎకై ్సజ్‌శాఖ అధికారులు చేసేదేమీ లేక బెల్ట్‌షాపులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 73 మద్యం దుకాణాలు, 16బార్‌లలో అధికారికంగా అనుమతులతో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. అనధికారికంగా జిల్లాలో సుమారు 2వేలకు పైగా బెల్ట్‌షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. బెల్ట్‌షాపుల కారణంగానే మద్యం విక్రయాలు అధికంగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఈ ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, పండుగలన్నీ కలిసి రావడంతో గత ఆర్థిక సంవత్సరాని కంటే ఈసారి వార్షికాదాయం పెరిగింది.
2024–2025 699952 1126705 708,82,09,729
2025–2026 7,02,519 9,88,681 751,96,32,434


