విద్యార్థినులకు కలెక్టర్‌ అభినందన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినులకు కలెక్టర్‌ అభినందన

Jan 26 2026 5:03 AM | Updated on Jan 26 2026 5:03 AM

విద్యార్థినులకు కలెక్టర్‌ అభినందన

విద్యార్థినులకు కలెక్టర్‌ అభినందన

జన్నారం: జాతీయస్థాయి కళోత్సవంలో ప్రతిభ కనబరిచిన కిష్టాపూర్‌ జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థినులు ఎస్‌.అరవిందరాణి, కే వర్షితతోపాటు గైడ్‌ టీచర్లు కమలాకర్‌, ప్రకాశ్‌ను కలెక్టరేట్‌లో ఆదివారం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, ఎమ్మెల్యే గ డ్డం వినోద్‌, డీఈవో యాదయ్య అభినందించారు. ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్న, సర్పంచ్‌ వాసల నరేశ్‌, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్‌ మంగ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

గణతంత్ర వేడుకలను

విజయవంతం చేయండి

నస్పూర్‌: జిల్లా కేంద్రంలోని బాలుర పాఠాశాల పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రయ్య ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌, జిల్లా మెజిస్ట్రేట్‌ కుమార్‌ దీపక్‌ హాజరై ఉదయం 9గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవందనం చేస్తారని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌ ప్రసంగం, బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, ప్రశంసాపత్రాల ప్రదానం, స్టాళ్ల సందర్శన, ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement