అ‘పూర్వ’ం.. అద్వితీయం | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ’ం.. అద్వితీయం

Nov 10 2025 8:18 AM | Updated on Nov 10 2025 8:18 AM

అ‘పూర

అ‘పూర్వ’ం.. అద్వితీయం

మంచిర్యాలటౌన్‌: జిల్లాలోని బెల్లంపల్లి ఎమ్మార్‌ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో 1975 నుంచి 1988 వరకు ఆయా విద్యాసంవత్సరాల్లో ప దోతరగతి చదివినవారంతా ఆదివారం జిల్లా కేంద్రంలో అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 104 మంది హాజరై పాఠశాలలో చదివిన జ్ఞాపకాల ను గుర్తు చేసుకున్నారు. రోజంతా సరదాగా గడిపి సందడి చేశారు. అప్పటి ప్రధానోపాధ్యాయుడు క స్తూరి దేవరాజ్‌, ఉపాధ్యాయులు డైనా, కళావతి, స రోజ లక్ష్మి, కమలాకుమారి, స్వర్ణలత, కాంతయ్య, రాజయ్య, రాంరెడ్డి, వెంకటేశ్వర్‌రావు, సత్యనారా యణ, ప్రేమ్‌సాగర్‌ను ఆహ్వానించి సన్మానించారు. కార్యక్రమాన్ని 1975 బ్యాచ్‌కు చెందిన భాగ్యలక్ష్మి, జయశీల, సత్యవతి ఆధ్వర్యంలో నిర్వహించారు.

శ్రీరాంపూర్‌: నస్పూర్‌లోని ఎవర్‌గ్రీన్‌ పాఠశాల 2003–04 బ్యాచ్‌ పదో తరగతి పూర్వ విద్యార్థులు మంచిర్యాలలోని ఓ పంక్షన్‌హాల్‌లో అపూర్వ సమ్మేళనం పేరిట ఒక్కచోట కలుసుకున్నారు. పాఠశాలలో చదివిన రోజులను గుర్తు చేసుకుని సంబురంగా వేడుక జరుపుకొన్నారు. కరస్పాండెంట్‌ పరమేశ్వర్‌రావు, ఉపాధ్యాయుడు సత్యనారాయణ, పూర్వవిద్యార్థులు తిప్పని లింగమూర్తి, రఘు, అంజన్‌, అశోక్‌, సదానందం తదితరులు పాల్గొన్నారు.

అ‘పూర్వ’ం.. అద్వితీయం1
1/1

అ‘పూర్వ’ం.. అద్వితీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement