ఆశయాలను సాధిద్దాం
శ్రీరాంపూర్: అమరుల ఆశయాలను సాధిద్దామని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కా ర్యదర్శి లాల్‌కుమార్ పేర్కొన్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీరాంపూర్‌లోని కొత్తరోడ్‌లోగల అమరవీరు ల స్తూపం వద్ద జెండా ఆవిష్కరించి నివాళులర్పించారు. కార్మిక వాడల్లో ర్యాలీ నిర్వహించి న అనంతరం ఐఎఫ్‌టీయూ కార్యాలయం వద్ద సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీడిత ప్రజ ల కోసం అనేక మంది విప్లవకారులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. దేశ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు రావాల ని వారు ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. వారి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి పాలకవర్గ విధానాలను ప్రతిఘటించాల ని పిలుపునిచ్చారు. ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బ్రహ్మానందం, నాయకులు శ్రీనివాస్, మేకల రామన్న, మల్లన్న, రెడ్డిమల్ల ప్రకాశం, తిరుపతిరెడ్డి, రత్నం, ప్రభాకర్, జ్యోతి, శ్రీకాంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


