ఎస్టీపీపీలో మరో ప్లాంట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్టీపీపీలో మరో ప్లాంట్‌

Nov 10 2025 8:18 AM | Updated on Nov 10 2025 8:18 AM

ఎస్టీపీపీలో మరో ప్లాంట్‌

ఎస్టీపీపీలో మరో ప్లాంట్‌

జైపూర్‌: మండలంలోని పెగడపల్లిలో 800 మె గావాట్ల సామరథ్యంలో సింగరేణి కొత్త విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మిస్తామని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బలరాంనాయక్‌ తెలిపారు. ఇందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎస్‌టీపీపీ(సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌)ను ప్లాంట్‌ ఈఅండ్‌ఎం తిరుమల్‌రావుతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈడీ చిరంజీవి, జీఎంలు నరసింహారావు, మదన్‌మోహన్‌ సీఎండీకి స్వాగ తం పలికారు. అనంతరం బలరాం నూతనంగా నిర్మించే ప్లాంట్‌ ప్రదేశంతోపాటు ప్లాంట్‌లో నూ తనంగా చేపట్టిన మిథనాల్‌ ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఇందారం ఓపెన్‌కాస్ట్‌ గనిని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున బొగ్గు, ఓబీ వార్షిక లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎండీ వెంట ఎస్వోటూ జీఎం సత్యనారాయణ, పీవో వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు హరినా రాయణ, రాజన్న, జక్కారెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement