
బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌గా సింగరేణి ఉద్యోగి కూతురు
లక్సెట్టిపేట: మండలంలోని తి మ్మాపూర్ గ్రామానికి చెందిన చుంచు సాయి శ్రీజ గ్రూప్–1 ప్రతిభ కనబర్చి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కొలువు సాధించింది. సాయిశ్రీజ తండ్రి చుంచు పోచయ్య సింగరేణి ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి చంద్రకళ గృహిణి. అన్నయ్య సౌమిత్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉ ద్యోగం చేస్తున్నారు. సాయిశ్రీజ ఒకటి నుండి పదవ తరగతి వరకు మంచిర్యాలలో చదువుకుంది. ఇంటర్మీడియె ట్ నారాయణ కళాశాలలో, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. ఇటీవల గ్రూప్–4లో ఉద్యోగం సా ధించి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూని యర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తా జాగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు.