
ఐక్యతతోనే అభివృద్ధి
శ్రీరాంపూర్: కులస్తులందరూ ఐక్యతతో ఉంటేనే అభివృద్ధి సాధిస్తారని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం తెలిపారు. పటేల్స్ ఎంటర్‌ప్రెన్యూర్ నెట్వర్క్ (పెన్) ఆధ్వర్యంలో నస్పూర్ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మున్నూరు కాపు కులస్తుల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్ అనే సంస్థలో మున్నూరు కాపు సభ్యులు చేరాలన్నారు. ఇందులో అన్నివర్గాల వారు ఉన్నారని, దీనివల్ల అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. పెన్ రాష్ట్ర కోఆర్డినేటర్ భరత్‌కుమార్ మాట్లాడుతూ పెన్ సంస్థలో ప్రస్తుతం లక్ష మంది ఉన్నారని, దీన్ని 25 లక్షలకు చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సాదినేని రమేశ్, కాసెట్టి సుధాకర్, అభినవ్ శేఖర్, పెంచాల వేణు, భాస్కర్ల రాజేశం, బోరిగం వెంకటేశం, నెమలికొండ కుమార్ పాల్గొన్నారు.