
‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ’కు ఎంపికై న ఆరాధ్య
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన ఆరాధ్య స్టార్ కిడ్ విభాగంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ పురస్కారానికి ఎంపికై ంది. హైదరాబాద్‌కు చెందిన రౌండ్ టేబుల్ సంస్థ చేపట్టిన ఎంపిక పోటీల్లో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ అల్లాడి సురేష్–శాంతి దంపతుల కుమార్తె ఆరాధ్య లక్ష్మి అవార్డుకు ఎంపికై ంది. పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా బాలలు పాల్గొనగా తుది పోటీలకు ఆరుగురు ఎంపికయ్యారు. వారిలో రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా చిన్నారి ఆరాధ్యలక్ష్మి ఎంపికై ంది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకుల చేతుల మీదుగా పురస్కారం అందుకుంది.