
అమ్మ సన్నిధిలో భక్తజనం
బాసర ఆలయంలో మూలానక్షత్ర పూజలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు గోదావరి వద్ద భారీ భద్రత ఏర్పాట్లు
భైంసా/బాసర: బాసరలోని చదువుల తల్లి సరస్వతీని అత్యంత ప్రీతిపాత్రమైన మూలానక్షత్ర శుభఘడియల్లో దర్శించుకునేందుకు రాష్టం నలు మూలల నుంచి భక్తులు సోమవారం వేలసంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి వేకువజామునుంచే బారులు తీరారు. దివ్యమూహూర్తాన తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. అధికసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది.
ప్రత్యేక అలంకరణ...
మూలానక్షత్రం పూజల కోసం బాసర ఆలయాన్ని ప్రత్యేకంగా పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగ ణం పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించా రు. ప్రత్యేక అలంకరణల మధ్య అమ్మవారిని స్మరి స్తూ భక్తులు దర్శనం చేసుకున్నారు. ప్రసాదల కౌంటర్ వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో కనిపించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కిక్కిరిసిన భక్తులు కొంతమేర ఇక్కట్లకు గురయ్యారు. వ్యాసగుహ, మ హంకాళి ఆలయం వద్ద భక్తుల సందడి కనిపించింది. ఆలయంలో మధుకర దీక్షలు స్వీకరించిన మాలధారులంతా స్వచ్ఛందంగా సేవలు అందించారు.
ఉప్పొంగిన గోదావరి
సోమవారం సైతం బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహించింది. గంగమ్మ తల్లి సూర్యేశ్వర ఆలయాన్ని తాకుతూ వరద నీరు ప్రవహించింది. నెల రోజులుగా బాసర వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. మూల నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు రక్షణగా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ భక్తులను కట్టడి చేశారు.
ఆదాయం రూ.25,65,100
బాసర: బాసర సరస్వతీ ఆలయానికి సోమవారం భారీగా ఆదాయం సమకూరింది. భక్తుల మొక్కులు, చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు ద్వారా ఆదాయం వచ్చింది. రూ.వెయ్యి అక్షరాభ్యాస పూజలు 1,065 జరిపించగా.. రూ.16,05,000, రూ.150 అక్షరాభ్యాసాలు 526 ద్వారా రూ.78,900, రూ.100 మండప ప్రవేశం 1930 ద్వారా రూ.1,93,000, రూ.50 మండప ప్రవేశం 310 ద్వారా రూ.15,500, రూ.100 అభిషేకం లడ్డు ప్రసాదం 2565 ద్వారా రూ.2,56,500, లడ్డు పులిహోర ప్రసాదాలతో రూ.4,16,200 సమకూరింది. మొత్తంగా రూ.25,65,100 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
పలువురి దర్శనం...
సరస్వతీ అమ్మవారిని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ అభిలాష అభినవ్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌తో పాటు పలువురు దర్శించుకున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూలనక్షత్రం కలిసిరావడంతో సుదూర ప్రాంతాల భక్తులు ఒకరోజు ముందుగానే వచ్చారు.

అమ్మ సన్నిధిలో భక్తజనం

అమ్మ సన్నిధిలో భక్తజనం

అమ్మ సన్నిధిలో భక్తజనం